Indians Hijacked: రెండు నౌకలు హైజాక్ .. 22 మంది భారతీయులు క్షేమం
Indians Hijacked: రెండు కమర్షియల్ నౌకలను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌకల్లో 22 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌకలను హైజాక్ చేసినట్లు సీనియర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒకరు చెప్పారు.
న్యూఢిల్లీ: రెండు నౌకలను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌకల్లో 22 మంది భారతీయులు(Indians Hijacked) ఉన్నారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌకలను హైజాక్ చేసినట్లు సీనియర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒకరు చెప్పారు. ఆయిల్ ట్యాంకర్‌తో ఎరిత్రియాకు వెళ్తున్న ఎంటీ సిబు 1 నౌకలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 16 మంది భారతీయులు అని తెలిసింది. అయితే గల్ఫ్ ఆఫ్ ఎడన్ వద్ద సముద్ర దొంగలు ఆ నౌకను హైజాక్ చేసినట్లు గుర్తించారు. ఆగస్టు 20వ తేదీన యెమెన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కెమెరూన్‌కు వెళ్తున్న మరో కార్గో షిప్‌ను కూడా పైరేట్స్ హైజాక్ చేశారు. సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ కోస్టు వద్ద ఆగస్టు 17వ తేదీన ఈ ఘటన జరిగింది. 10 మంది ఉన్న ఆ నౌకలో ఆరుగురు భారతీయులే. అయితే తాజా సమాచారం ప్రకారం రెండు నౌకలకు చెందిన భారతీయులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

