Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Helicopters Collide: నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. సోలుకుంబు హెలిపోర్ట్‌లో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు.
ఖాట్మాండు: నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి(Helicopters Collide). ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నేపాల్‌లోని సోలుకుంబు హెలిపోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం 8.11 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ సమయంలో ఢీకొన్నాయని నేపాలీ పోలీసులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని లుక్లా ఆస్పత్రికి మరో హెలికాప్టర్లో తరలించారు. అయితే హెలికాప్టర్లు ఢీకొన్న సమయంలో మంటలు వ్యాపించలేదు. మృతిచెందిన వ్యక్తి విదేశీయుడని తెలిసింది. కానీ అతని వివరాలు పూర్తిగా తెలియదు. ఇక గాయపడ్డ వ్యక్తి వివరాలు కూడా తెలియదు. ల్యాండింగ్ సమయంలో రెండు హెలికాప్టర్లకు చెందిన రోటర్ బ్లేడ్లు తాకడం వల్ల ప్రమాదం జరిగింది.
BREAKING: Two helicopters operated by Fishtail Air and Dynasty Air collided while landing at Pheriche helipad in Solukhumbu. Authorities said the helicopters’ rotor blades struck each other during the landing process. Further details about the incident are awaited.
Video ©: Webcam Nepal.
— Everest Today (@EverestToday) November 3, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

