Rain Alert | రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు
Rain Alert | రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు |

హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, బలహీనపడిందని చెప్పింది. దానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. పశ్చిమ- వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణిస్తుందని తెలిపింది.
కొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఒడిశా – బెంగాల్ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు వివరించింది. తెలంగాణలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

