TTD | డిసెంబర్లో మార్కెట్లోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు : ఈఓ
TTD | డిసెంబర్లో మార్కెట్లోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు : ఈఓ | తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ లోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజినీరింగ్ పనులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కోయంబత్తూర్‌కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు.. సదరు సంస్థ పది సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఈఓ వివరించారు. ఫ్లోర్ క్లీనర్, సబ్బులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.
వీటిలో టీటీడీ వాడగా, మిగిలినవి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఆయుర్వేద ఫార్మసీలో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. సమావేశంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, పశువైద్య విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ ప్రొఫెసర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

