టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. జులై 1వ తేదీన పరీక్ష నిర్వహణ. ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదే సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరగనుంది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్టీయూహెచ్కి ఇది ఏడోసారి. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 22వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో మే 31వ తేదీ వరకు, రూ.500 అపరాద రుసుంతో జూన్ 14 వరకు, రూ.2,500 అపరాద రుసుంతో జూన్ 24వ వరకు అదే రూ. 5 వేల అపరాద రుసుంతో జూన్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 400 కాగా ఇతర అభ్యర్థులకు రూ.800. పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు https://ecet.tsche.ac.in కు లాగినై తెలుసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- JNTUH
- TS ECET
- TS ECET 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

