Donald Trump : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అడ్డంకులు తొలగించడం కోసం ఇరాన్‌తో యుద్ధానికి కలిసి రావాలని యూరప్ దేశానికి ట్రంప్ పిలుపునిచ్చినా.. అందుకు యూరప్ కంట్రీస్ నిరాకరించాయి. తాజాగా యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) మాట్లాడుతూ.. అది తమ యుద్ధం కాదని, ఆ యుద్దంలోకి తాము దిగబోమని చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి గుండా అనుమతి కోసం తగిన కార్యచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నాటో కూటమి నుంచి తాము వైదొలుగుతామని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని అన్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ కూటమి ఓ కాగితపు పులి వంటిదని విమర్శించారు. ఈ విషయం రష్యాకూ తెలుసునని చెప్పారు. ఆ కూటమి మాటలకు తానెప్పుడూ ప్రభావితం కాలేదన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు కలిసి రావాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో నాటో దేశాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న ట్రంప్.. వాళ్లు పిరికివాళ్లంటూ ఇటీవల కూడా విమర్శించారు.