అవమానాలు ఎదుర్కొన్నాడు.. ఛీత్కారాలు భరించాడు. ఆకలితో అలమటించాడు..వైఫల్యాల పరంపర కొనసాగుతున్నా ఓపికతో ఉన్నాడు. మానసిక వేదన భరించలేక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తనకు ఏది చేతగాదని తోటివాళ్లంతా అన్నారో అది నేర్చుకున్నాడు. తన లక్ష్యంకోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. చెదరని ఆత్మస్థైర్యంతో పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. మారుమూల తండా నుంచి సుప్రీంకోర్టుకు అనుబంధంగా ఉండే ఇండియన్ లా ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టాడు. తనను అవహేళన చేసినవారిపై.. తన పేదరికంపై తన విజయంతో పైచేయి సాధించాడు. ఇది ఓ తండా యువకుడు రవిరాథోడ్ విజయగాథ..