యువతులను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిపై పీడీ యాక్టు నమోదు

ఎల్బీనగర్, మే 27: యువతులను అక్రమ రవాణా, ఇంటర్ స్టేట్ హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పోలీసులు పీడీ యాక్టును నమోదు చేశారు. వారి నుంచి నలుగురు బాధిత మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన అల్లాని శ్యామ్(49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య(32) కలిసి చైతన్యపురి, అల్కాపురి రోడ్ నం.14లో సాయిసదన్ అపార్ట్మెంట్లో నివాసముంటూ అసోసియేట్ ద్వారా లోకాన్టో వెబ్సైట్లో అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నంబర్లను సేకరించి ఆకట్టుకుంటున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, యువతులను, పేదరికంలో ఉన మహిళలను ఆకర్షించి వారిని ఇతర రాష్ర్టాలకు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి అల్లాని శ్యామ్, రామిశెట్టి సంధ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ రాష్ర్టాలకు చెందిన నలుగురు మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

