పాట కోసం తపన
‘నటనతో పాటు సంగీతం కూడా నా జీవితంలో ఓ భాగం. లండన్‌లోని వివిధ వేదికలపై పాటలు పాడాను. లాక్డౌన్ వల్ల లైవ్ మ్యూజిక్ చేసే వీలులేకుండా పోయింది. భవిష్యత్తులో నటనతో పాటు మ్యూజిక్‌పై దృష్టిపెడతా’ అని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్. నటనతో పాటు సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని కనబరుస్తూ మల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుందీ భామ. అయితే ఇటీవలకాలంలో సినిమా కమిట్మెంట్స్ వల్ల సింగింగ్‌కు కాస్త బ్రేక్ నిచ్చానని చెప్పింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సుందరి సంగీతంపై తనకున్న మక్కువ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ‘లండన్‌లోని ప్రఖ్యాత బ్యాంక్ భవనంలో సోలో లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడున్న వారంతా నా పాటకు ముగ్ధులైపోయారు. అలాగే ఓ రెస్టారెంట్ దగ్గర చేసిన కచేరికి కూడా మంచి పేరొచ్చింది. మళ్లీ అలాంటి సోలో షోస్ చేయాలనుంది. లాక్డౌన్ వల్ల అవన్నీ కుదరలేదు. సంగీతంలో నా ప్రతిభాపాటవాల్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించాలనుకుంటున్నా. మున్ముందు సోలో గానంతో మెప్పిస్తా’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

