నేటి విద్యాపరిమళాలూ నాటి సంస్కరణల ఫలమే

తెలంగాణ ముద్దు బిడ్డ, అపర మేధావి, దేశంలో విద్యా సంస్కరణల ఆద్యుడు మన పీవీ నరసింహారావు. పీవీ విద్యా సంస్కరణల ఫలితాలే నేటి మన గుణాత్మక విద్యారంగ సంస్కరణలకు పునాది. నాటి కొఠారీ కమిషన్ రూపొందించిన తొలి జాతీయ విద్యా విధానం (1966) అమలు అనంతరం గుణాత్మక విద్య పరంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయి వరకు ఆశించిన ఫలితాలు పెంపొందలేదు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో పీవీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు (1986) జాతీయ విద్యా విధానం రూపొందించి అమలు పరిచారు. వాటి ఫలితాలే నేటి గుణాత్మక విద్యకు, ప్రగతికి నాంది.దేశ పౌరులందరికీ విద్యా పరిమళాల్నీ,సుగంధాల్నీ అందించాలన్న తపనతో నిరంతర అక్షరాస్యతా కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. దేశంలోని ప్రతి ఆవాస ప్రాంతంలో ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు, ప్రతి 3 కిలో మీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలో మీటర్లకు ఒక ఉన్నత పాఠశాలను ఏర్పాటుచేశారు. బడీడు పిల్లలందరూ బడిలో చేరేలా కార్యక్రమాలు రూపొందించి అమలుపరిచారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం రెండు శాశ్వత తరగతి గదులు నిర్మించటం, ఇద్దరు ఉపాధ్యాయుల నియామకం.. ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అమలుపరిచారు. దీనివల్లే ప్రాథమిక విద్యారంగంలో మార్పులకు బలమైన పునాది పడింది.
పాఠశాల విద్య మాతృభాషలో కొనసాగాలని, బడీడు బాలబాలికలు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని, పాఠశాల భవనాలు, విద్యాసంస్థలు వారిని ఆకర్షించేలా ఉండాలని చెప్పి, అందుకోసం కృషిచేశారు.దృశ్య శ్రవణ మాధ్యమాల బోధనోపకరణాలను ఉపయోగించి కృత్యాత్మక బోధన కొనసాగాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బాలబాలికల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావన పెంపొందించేందుకు నవోదయ విద్యా సంఘటన్‌ను ఏర్పాటుచేశారు. జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల పేరుతో గురుకుల విద్యాసంస్థలను ప్రారంభించారు. దేశంలోని రాష్ర్టేతర భాషలను విద్యార్థులు నేర్చుకునేలా, కలిసి జీవించేలా ప్రోత్సహించారు. దేశంలో, రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వేల గురుకుల విద్యాలయాల రూపకల్పనకు, స్థాపనకు పీవీయే కారణం.

పాఠశాల విద్య మాతృభాషలో కొనసాగాలని, బడీడు బాలబాలికలు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని, పాఠశాల భవనాలు, విద్యాసంస్థలు వారిని ఆకర్షించేలా ఉండాలని చెప్పి, అందు కోసం కృషిచేశారు. దృశ్య శ్రవణ మాధ్యమాల బోధనోపకరణాలను ఉపయోగించి కృత్యాత్మక బోధన కొనసాగాలని చెప్పారు. కనీస అభ్యసనా సామర్థ్యాలు బాలబాలికల్లో తరగతుల స్థాయి, శారీరక స్థాయిలకు అనుగుణంగా పాఠశాలల్లో పెంపొందించాలని ఉద్బోధించారు. బాలబాలికలందరికీ తాగునీటి సదుపాయాలు, మూత్రశాలలతోపాటు కనీస వసతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 7, 10, 12 తరగతులకే వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించాలని, మిగతా తరగతుల్లో విద్యార్థుల హాజరు ప్రాతిపదికనే ఉన్నత తరగతులకు స్థాయోన్నతి (ప్రమోట్) చేయాలని చెప్పారు. డిటెన్షన్ పద్ధతిని తొలగించటం వల్లే దేశంలో బాలబాలికల్లో అక్షరాస్యత శాతం పెంపొందుతున్నది. ఇదంతా పీవీ విద్యా సంస్కరణల వల్ల సాధ్యమైందని చెప్పొచ్చు.
ప్రాథమిక విద్యాస్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, ఉన్నత తరగతుల్లో త్రిభాషా సూత్రం అమలు, తద్వారా మాతృభాష, జాతీయభాష, అంతర్జాతీయ భాష (ఇంగ్లిష్) విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని పీవీ తెలిపారు. గ్రామీణులకు దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా సౌకర్యాలను కల్పించాలని ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీల స్థాపన ద్వారా విద్యకు దూరమైన ప్రతి పౌరునికీ విజ్ఞానార్జన, విద్యార్జన పొందే అవకాశం కల్పించాలని కృషిచేశారు. ప్రజలందరికీ సమాన విద్యావకాశాలు లభించాలన్నది ఆయన ఉన్నత ఆశయం.
తెలంగాణ బిడ్డ పీవీ చొరవతో రూపొందిన జాతీయ విద్యా విధానం అమలు వల్ల, విద్యా సౌకర్యాల వల్లే నేడు గ్రామీణ విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో పలు నూతన ఆవిష్కరణలను మన విద్యార్థులు అందించటం మనం గర్వించదగింది. మన పీవీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులుగా, ప్రధానిగా దేశానికి అందించిన సేవలు విశిష్టమైనవి. దేశ ఆర్థికాభివృద్ధికి ఆయన చర్యలు ఎంతగానో తోడ్పాటునందించాయనటంలో సందేహం లేదు. మన పీవీ అం దరికీ ఆదర్శప్రాయుడు. నేటితరం సైతం పీవీ ఆదర్శభావాలను, సేవాతత్పరతను అలవర్చుకొని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.
డాక్టర్ ,అనభేరి రాజేశ్వరరావు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

