TTD | సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగానే..
TTD | సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగానే.. | తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది.

తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఉత్సవాలకు ముందు 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించింది. అక్టోబర్ 6 తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని టీటీడీ తెలిపింది.
ఉత్సవాల విశేషాలు
7న ఉదయం ధ్వజారోహణం – సాయంత్రం పెద్దశేష వాహనసేవ
8న ఉదయం చిన్నశేష వాహనసేవ – సాయంత్రం హంస వాహనసేవ
9న ఉదయం సింహవాహన సేవ – సాయంత్రం ముత్యపు పందిరి వాహనసేవ
10న ఉదయం కల్పవృక్ష వాహనసేవ – సాయంత్రం సర్వభూపాల వాహనసేవ
11న ఉదయం మోహినీ అవతారం – సాయంత్రం గరుడ వాహనసేవ
12న ఉదయం హనుమంత వాహనసేవ – సాయంత్రం గజ వాహనసేవ
13న ఉదయం సూర్యప్రభ వాహనసేవ – సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ
14న ఉదయం సర్వభూపాల వాహనసేవ (రథోత్సవంకు బదులు) – సాయంత్రం అశ్వవాహనసేవ
15న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – సాయంత్రం ధ్వజారోహణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

