ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన
ములుగు, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, ఓ గ్రేహౌం డ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకొన్నది. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లను అపహరించి హత్య చేయాలని సీపీఐ మావోయిస్టు గ్రూప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున వ్యూహం పన్నింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 16 నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ములుగు-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌లో కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము న కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ముగ్గు రు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో గాలించగా ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఎన్సాస్ రైఫిల్, ఒక సింగిల్‌బోర్ వెపన్, 10 రాకెట్ లాంచర్లు ఇతర వస్తువులు లభించాయి. మృతి చెందిన వారి వివరా లు తెలియాల్సి ఉన్నది. ఇందులో నల్లగొండ జిల్లాకు చెందిన మధు అనే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. మధును చికిత్స నిమిత్తం వరంగల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

