అమెరికా పోలీస్, జైళ్లు సహా.. టెస్లా సెక్యూరిటీ కెమెరాలు హ్యాక్

వాషింగ్టన్: అమెరికా పోలీస్ విభాగం, జైళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లతోపాటు టెస్లా, క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలకు చెందిన సుమారు 1.5 లక్షల లైవ్ సెక్యూరిటీ కెమెరాలు హ్యాక్ అయ్యాయి. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ వెర్కాడ ఇంక్ సేకరించిన సెక్యూరిటీ కెమెరాల డేటాను చోరి చేసినట్లు ఒక హ్యాకర్ల బృందం తెలిపింది. మహిళల ఆరోగ్య క్లినిక్స్, మానసిక ఆసుపత్రుల వీడియో ఫుటేజ్‌ను వెర్కాడ కార్యాలయాల నుండి హ్యాకర్లు యాక్సిస్ చేశారు. ఆసుపత్రులలోని కొన్ని కెమెరాలు, పలు రకాల వ్యక్తులను గుర్తించే ముఖ గుర్తింపు సాంకేతికత డేటాను చౌర్యం చేశారు. వెర్కాడా కస్టమర్లకు చెందిన పూర్తి వీడియో ఆర్కైవ్‌ను కూడా యాక్సిస్ చేయగలినట్లు హ్యాకర్లు వెల్లడించారు.
కాగా, ఫ్లోరిడా ఆసుపత్రి హాలిఫాక్స్ హెల్త్ లోపల ఉన్న వెర్కాడా కెమెరా ద్వారా ఎనిమిది మంది హాస్పిటల్ సిబ్బంది ఒక వ్యక్తిని అదుపు చేసే లైవ్ వీడియోను హ్యాకర్లు బయటపెట్టినట్లు ‘బ్లూమ్‌బెర్గ్’ పేర్కొంది. అలాగే షాంఘైలోని టెస్లా గిడ్డంగి లోపల చిత్రీకరించిన సంస్థకు చెందిన కార్మికుల మరో వీడియోను హ్యాకర్లు బహిర్గతం చేసినట్లు తెలిపింది. టెస్లా కర్మాగారాలు, గిడ్డంగులలోని 222 కెమెరాల యాక్సెస్ పొందినట్లు హ్యాకర్లు వెల్లడించారు.
నిఘా వీడియోలు, సంబంధిత వ్యవస్థలను ఈజీగా విచ్ఛిన్నం చేయవచ్చని చెప్పేందుకే అంతర్జాతీయ హ్యాకర్స్ కలిసికట్టుగా ఈ డేటా చౌర్యానికి పాల్పడ్డారని కాలిఫోర్నియాకు చెందిన శాన్ మాటియో డేటాను బ్రీచ్ చేసినట్లు పేర్కొన్న హ్యాకర్లలో ఒకరైన టిల్లీ కోట్మన్ తెలిపారు. పెట్టుబడిదారీ విధానికి వ్యతిరేకంగా, సమాచార స్వేచ్ఛతోపాటు సరదా కోసం ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు చెప్పారు. గతంలో చిప్ మేకర్ ఇంటెల్ కార్ప్, కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కో వంటి వాటిని హ్యాక్ చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు అనధికార యాక్సిస్‌ను నిరోధించడానికి తాము అన్ని అంతర్గత నిర్వాహణ ఖాతాలను నిలిపివేసినట్లు వెర్కాడ ప్రతినిధి తెలిపారు. తమ అంతర్గత భద్రతా బృందం, బాహ్య భద్రతా సంస్థ ఈ సమస్య స్థాయి, పరిధిని పరిశీలిస్తున్నాయని చెప్పారు. చట్టపరమైన చర్యలకు కూడా ఉపక్రమించినట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

