న్యూఢిల్లీ: ఆర్పిత ముఖర్జీ. ఇప్పుడీ పేరు అంతటా వినిపిస్తోంది. బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు. ఆమె ఇంట్లోనే ఇటీవల 20 కోట్ల నగదును అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌తో ఆ డబ్బుకు లింకు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఆర్పిత, మంత్రి పార్ధాలు అరెస్టు అయ్యారు. అయితే ఆర్పిత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
బెంగాలీతో పాటు ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీలో 2008 నుంచి 2014 వరకు యాక్టివ్‌గా ఉన్నారామె. ఆమె మోడల్‌గా కూడా చేశారు. కోల్‌కతాలో ఉత్తర శివారు ప్రాంతమైన బెల్గోరియాలోని మధ్య స్థాయి కుటుంబంలో పుట్టారు. కాలేజీలో చదువుతున్న నాటి నుంచి మోడలింగ్‌లోకి వచ్చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆమె జార్గ్రామ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నది. కానీ ఆయన్ని వదిలేసి కోల్‌కతాలో ఉంటోంది. 2008లో రిలీజైన్ పార్ట్నర్ సినిమాలో జీత్‌తో కలిసి నటించింది. మామా భగ్నే చిత్రంలోనూ నటించింది. 2009లో బెంగాలీ సూపర్‌స్టార్ ప్రసూన్జిత్ ఛటర్జీతో కలిసి నటించింది. 2019, 2020లో కోల్‌కతాలోని అతిపెద్ద దుర్గా పూజా కమిటీ అయిన నక్తాలా ఉదయన్ సంఘ తరపున ప్రచారం చేసింది.