Layoffs | ఆర్నెల్లలో లక్ష మందిపై వేటు.. ఐటీ రంగంలో పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్‌లు!
ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. స్టార్టప్‌లు మొదలుకొని దిగ్గజ కంపెనీల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
- ఐటీ రంగంలో కొనసాగుతున్న కొలువుల కోత
- 2024 తొలి అర్ధ భాగంలో భారీగా తొలగింపులు
Layoffs | న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. స్టార్టప్‌లు మొదలుకొని దిగ్గజ కంపెనీల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దాదాపు లక్షమంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో మొదలైన తొలగింపుల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా తదితర బడా కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఆర్థిక మందగమనం, కొవిడ్ సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడం, కొవిడ్ తర్వాత డిమాండ్ తగ్గడం, ఖర్చుల తగ్గింపులో భాగంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతుండటం.. ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం. 2022లో 1,064 కంపెనీలు సుమారు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఆ మరుసటి ఏడాది లేఫ్‌లు మరింత పెరిగాయి. 2023లో 1,175 కంపెనీలు 2.6 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022తో పోలిస్తే ఇది 58 శాతం అధికం. కొన్ని నెలలుగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నప్పటికీ, 2024లో కూడా లేఆఫ్స్‌కు అడ్డుకట్ట పడే సంకేతాలు కనిపించడం లేదు.
సైలెంట్ లేఫ్ల ట్రెండ్
ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఇప్పటికే టెకీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వేళ సైలెంట్ లేఆఫ్ ట్రెండ్ వారిలో మరింత బుగులు పుట్టిస్తున్నది. చాలా కంపెనీలు బయటకు ప్రకటించకుండానే సైలెంట్‌గా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గత ఏడాది సుమారు 20 వేల మంది టెకీలు ఇలా ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 2 వేల నుంచి 3 వేల మందిని భారత ఐటీ కంపెనీలు సైలెంట్‌గా ఇంటికి పంపాయని నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది.
పేటీఎంలో చట్టవిరుద్ధంగా ఉద్వాసనలు
పేటీఎంపై పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా చట్టవిరుద్ధంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. పేటీఎం మేనేజ్మెంట్ తమను అనైతికంగా పనిలోంచి తొలగించిందని జూన్ మొదటి వారంలో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను వెల్లడించే ఈ మెయిళ్లు, ఇతర డాక్యుమెంట్లను వారు తమ ఫిర్యాదుకు జత చేశారు. కేంద్ర కార్మిక శాఖ తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని, అలా చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తొలగింపునకు గురైన ఒక ఉద్యోగి తెలిపారు.
ఏడాది ఉద్యోగాలు కోల్పోయినవారు
- 2022 ; 1,64,969
- 2023 ; 2,60,509
- 2024 (తొలి ఆర్నెల్లు) ; 98,834
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

