లక్నో: ఏ పార్టీ నుంచి అయినా రాష్ట్రపతి పదవి ఇస్తానంటూ ప్రతిపాదన వస్తే తాను అంగీకరించబోనని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. ‘ఒక వేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో మన పార్టీ కథ ముగిసినట్టే. కాబట్టి అలాంటి పదవిని ఏ పార్టీ ఆఫర్ చేసినా అంగీకరించను’ అని పేర్కొన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే మాయావతి రాష్ట్రపతి అవుతారంటూ బీజేపీ, ఆరెస్సెస్ తప్పుడు ప్రచారం చేస్తూ బీఎస్పీ క్యాడర్లో గందరగోళం సృష్టించాయని దుయ్యబట్టారు.