కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లో చాళుక్యుల కాలం నాటి మహామాత దేవాలయం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మహామాత ఎల్లమ్మ. కాగా జగతి శిల్పాలు, మహామాయ, కాలాముఖాచార్యుడు, శాంకరి తదితర విగ్రహాలు సైతం లభించాయి. – హైదరాబాద్