వీజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణీసింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సకల గుణాభిరామ’. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. సంజీవరెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌రావిపూడి, హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఆడియోను సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో నడిచే అందమైన కథ ఇది. కథానుగుణంగా చక్కటి తారాగణం కుదిరింది’ అని చెప్పారు. “బిగ్‌బాస్’ ద్వారా ఎంతోమంది ఆత్మీయుల్ని సంపాదించుకున్నా. హీరోగా చాలా అవకాశాలు మిస్సయ్యాయి. ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం కావడంతో నా కల నిజమైంది’ అని వీజే సన్నీ తెలిపారు.