TGTET for Teachers | రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీ టెట్ చైర్పర్సన్ ఈ నికోలస్ మంగళవారం విడుదల చేశారు. ఈ టెట్ పరీక్షలు ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు.
అర్హతలు
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు. అర్హులైన వారు పేపర్-1, పేపర్-2 పరీక్షల కోసం ఆన్లైన్లో జూలై 29 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు
పేపర్-1 లేదా పేపర్-2 ఒక్క పేపర్ రాసేవారికి రూ. 750, రెండు పేపర్లు రాసేవారికి రూ. 1000 ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఒక్కో పేపర్‌కు రూ. 700, రెండు రాస్తే రూ. 950 ఫీజు నిర్ణయించారు. ఇతర వివరాల కోసం వెబ్సైట్ https://schooledu.telangana.gov.in చూడవచ్చు. ప్రభుత్వ టీచర్ల కోసం ఏటా రెండు టెట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.