తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. తెప్పోత్సవాల్లో చివరి రెండు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు...
తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుంచి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో చివరి రెండు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం, ఈఈ నరసింహ మూర్తి, డిప్యూటీ ఈఈ సురేష్ బాబు, ఏఈ సురేష్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఏఈ మురళీకృష్ణ, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరంతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

