కరోనా వ్యాప్తి వేళ టెలిమెడిసిన్ సేవలు.. ఎలా పొందొచ్చంటే..?
కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి, ఆరోగ్య సేవల సమస్యల మధ్య టెలిమెడిసిన్ వాడకం మంచి ఎంపికగా చెప్పవచ్చు

కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి, ఆరోగ్య సేవల సమస్యల మధ్య టెలిమెడిసిన్ వాడకం మంచి ఎంపికగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యకు దవాఖానకు పరిగెత్తడం చూస్తున్నాం. అలాకాకుండా ఇంటి వద్దనే ఉండి మనకు కావాల్సిన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకునే వీలున్నది. అదే.. టెలిమెడిసిన్.
దేశంలో రెండవ వేవ్ కరోనా వైరస్ అనేక రాష్ట్రాల్లో మరోసారి భయంకరమైన పరిస్థితిని కలిగించింది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య వ్యవస్థలపై చాలా ఒత్తిడి పెరిగింది. సాధారణ వ్యాధిలో కూడా కరోనా భయం కారణంగా ప్రజలు దవాఖానలో చేరడం సాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితిలో రోగులు ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఇంట్లో కూర్చునే వైద్యుల నుంచి అవసరమైన సలహాలు పొందవచ్చు. తద్వారా ప్రజలకు ఇంట్లో గొప్ప ఉపశమనం లభిస్తుంది.
టెలిమెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యుల సేవలను గ్రామీణ స్థాయిలో కూడా పొందే వీలుంటుంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ-సంజీవని చాలా గొప్ప సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం నేషనల్ టెలిమెడిసిన్ సర్వీసులు 31 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఈ-సంజీవనీ ద్వారా వైద్య సలహాలు అందించేందుకు జాతీయ స్థాయిలో 31 వేలకు పైగా డాక్టర్లు, పారామెడిక్స్‌కు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
అత్యవసర చికిత్స అవసరం లేని రోగులు చికిత్స నాణ్యతలో రాజీ పడకుండా కరోనా బారిన పడే ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోవడానికి టెలిమెడిసిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకోవాలని ఇదివరకే సూచించింది. టెలిమెడిసిన్ కరోనా వ్యాప్తిని నిరోధించడమే కాకుండా, రోగుల రవాణా ఖర్చు, సమయం రెండింటినీ ఆదా చేస్తుంది. ఇప్పటికైనా ప్రజలు ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యకు దవాఖానలకు పరిగెత్తకుండా ఇంట్లో నుంచే వైద్య సేవలు పొందడం ద్వారా ఒత్తిళ్లను జయించవచ్చంటున్నారు వైద్యనిపుణులు.
ఇవి కూడా చదవండి..
గవర్నర్‌తో మిథున్ చక్రవర్తి భేటీ.. రాష్ట్రమంతటా చర్చ
భారత్ బయట కోవిషీల్డ్ ఉత్పత్తికి సీరం సంస్థ యోచన
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్‌తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

