హైదరాబాద్ :టెలిగ్రామ్ థీమ్ క్యూఆర్ కోడ్, ఎమోజి యానిమేషన్, మెసేజ్ రియాక్షన్ వంటి అనేక రకాల ఫీచర్లను పరిచయం చేసింది.టెలిగ్రామ్ యాప్ ఇటీవల ట్రాన్స్ లేషన్ ఆప్షన్ ను పరిచయం చేసింది. దీని ద్వారా సందేశాలను డిఫాల్ట్ గా తమకు నచ్చిన భాషలోకి సులభంగా అనువదించుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫీచర్లు డిఫాల్ట్‌గా మాన్యువల్‌గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఐతే ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
అక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఆయా ఫీచర్‌ను పొందవచ్చు. ఆ తర్వాత యూజర్ చదవలేని భాషల్లోని సందేశాల కోసం ట్రాన్స్లేషన్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆయా భాషల్లో మెసేజ్ చేసేందుకు వీలవుతుంది. ఈ యాప్ అరబిక్, కొరియన్, స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్లతో సహా 19 భాషలు అందుబాటులో ఉన్నాయి.
టెలిగ్రామ్‌లో మెసేజ్ లను ఎలా అనువదించవచ్చంటే..?
-మీ Android లేదా iPhoneలో టెలిగ్రామ్‌ని ఓపెన్ చేయండి.
– రైట్ సైడ్ వచ్చే మూడు-లైన్ల ఐకాన్‌పై నొక్కండి.
– మెను ఎంపికలో సెట్టింగ్‌లపై నొక్కాలి.
– క్రిందికి స్క్రోల్ చేసి, భాషపై నొక్కండి.
– ఇప్పుడు ట్రాన్స్ లేషన్ టోగుల్ బటన్ ను ఆన్ చేయండి.
– ఆతర్వాత మీరు అనువదించకూడదనుకునే డిఫాల్ట్ భాషను ఎంచుకోండి.
– మీరు సందేశాన్ని అనువదించాలనుకుంటున్న వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌కి వెళ్లండి.
– మీరు మీ డిఫాల్ట్ భాషకు అనువదించాలనుకుంటున్న సందేశంపై నొక్కండి.
-అనంతరం పాప్-అప్ మెనులో ట్రాన్స్ లేషన్ బటన్ నొక్కండి.. అంతే..