హైదరాబాద్: దక్షిణాఫ్రికా జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే రెండు రజత పతకాలు దక్కించుకున్న వ్రితి మళ్లీ మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచిన వ్రితి రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ గ్రిఫీత్, మార్టెన్స్ వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.