ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
డ్రైవింగ్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి ఆర్టీఏ ఏఐ సేవలను వినియోగించనుంది.
సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : డ్రైవింగ్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి ఆర్టీఏ ఏఐ సేవలను వినియోగించనుంది. ఇటీవల ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న ఏఐ విధానాలను అధ్యయనం చేసిన ఆర్టీఏ బృందం తెలంగాణలోనూ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏఐ తీసుకురాబోతుంది. అందులో భాగంగా తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా నాగోల్, కొండాపూర్ డ్రైవింగ్ ట్రాక్‌లలో ఏఐ ప్రక్రియను అమలు చేయడానికి రెడీ అయింది. డ్రైవింగ్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నట్టు ఏసీబీ సోదాల్లో బయటపడటంతో రోడ్డు ప్రమాదాల కట్టడిలో భాగంగా ఆ పరీక్షను మరింత కఠినంగా నిర్వహించడానికి ఆర్టీఏ అధికారులు సిద్ధమయ్యారు.
దళారుల ప్రమేయం లేకుండా, అధికారుల జోక్యం కూడా ఉండకుండా ప్రక్రియ అంతా ఏఐతోనే నిర్వహిస్తారు. దీంతో కచ్చితంగా డ్రైవింగ్‌పై అవగాహన ఉంటేనే పరీక్ష ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అవగాహన లేకున్నా లైసెన్స్ పొందడం కష్టమే అవుతుంది. ఈ విధానంతో చాలా మంది వాహనదారులు డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్‌పై మరింత అధ్యయనం చేసి అవగాహన పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలో ఏఐ విధానం సత్ఫలితాలిస్తున్నాయని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

