వేయిస్తంభాలగుడిని పునరుద్ధరించాలి
‘రామప్ప’పనులు పూర్తిచేయాలి
కేంద్రాన్ని కోరిన పోచంపల్లి
ఎంపీలతో కలిసి కేంద్రమంత్రికి వినతి
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచే వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేయాలని టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్‌కుమార్, బండా ప్రకాష్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి కేం ద్రపర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్‌కు వినతిపత్రం అందజేశారు. రామప్ప దేవాలయాల్లో చేపట్టిన సమగ్రాభివృద్ధి, పునరుద్ధరణ పనులను కూడా సకాలంలో పూర్తిచేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాకతీయులు రాజధాని ఓరుగల్లులో కట్టించిన వేయి స్తంభాల గుడినాటి శిల్పకళా సంపదకు నిదర్శనంగా నిలుస్తున్నదని తెలిపారు.
ఆలయంలో నక్షత్ర ఆకారంలో ఉండే వాస్తుశిల్పం అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి సాక్ష్యమని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల పునరుద్ధరణకు కార్పొరేట్ సోష ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు విరాళంగా ఇవ్వవచ్చని కేంద్రమంత్రి తెలి పారని ఎంపీలు పేర్కొన్నారు.‘కాకతీయరాజు రుద్రదేవుడి ఆదేశాల మేరకు క్రీ.శ 1175-1324 మధ్య వేయిస్తంభాల ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని విష్ణు, శివుడు, సూర్య తదితర హిందూ దేవతలకు అంకితం చేయబడినదిగా చెపుతారు. శాండ్ బాక్స్ పద్దతిని ఉపయోగించి 1000స్తంభాలతో దీని నిర్మా ణం చేపట్టారు. 800 ఏండ్లకుపైగా ఆలయం చెక్కు చెదరకుండా ఉన్నది. తర్వాత ఒకట్రెండు స్తంభాలు ఒరిగాయన్న కారణంగా ఆ లయానికి దక్షిణాన ఉన్న ‘నాట్య మండపం’ పునర్నిర్మాణం కోసం 2005లో పురావస్తుశాఖ స్తంభాలను తొలగించింది. 18 నెలల్లో పునరుద్ధరించాలని అనుకున్నా.. దశాబ్దం దాటినా పూర్తికాలేదు’ అని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం


