మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్

- ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్ష
- షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2022-23 విద్యాసంవత్సర ప్రవేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. ఆదివారం నోటిఫికేషన్ వెలువడనున్నది. వచ్చే నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 20న ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 194 మోడల్ స్కూళ్లలో 6-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. 6వ తరగతిలో మొత్తంగా 19,400 సీట్లను నింపనున్నారు. 7-10 తరగతుల్లో ఖాళీలను బట్టి సీట్లను భర్తీ చేస్తారు. ఈ ప్రవేశాల కోసం విద్యార్థులు telanganams. cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.150, వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

