ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం
ప్రాజెక్టుల నిర్మాణం : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

జగిత్యాల : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రైతులను రాజులుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.
గురువారం గొల్లపల్లి మండలంలో రైతు వేదికతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు. ఉచిత 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు పథకాలతో రైతుల బతుకుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదన్నారు.
రైతుల ఉత్పతులకు మద్దతు ధర, సాగువిధానం, పంట మార్పిడిపై రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు వేదికలు ఉపయోగపడతాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
రైతు బంధు అధ్యక్షుడు అందుబాటులో ఉంటారు. పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. పల్లెప్రగతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రసంశించిందని గుర్తు చేశారు.
అభివృద్ధిని విమర్శిస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జీ రవి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

