స్టడీ సర్కిళ్లు.. కొలువుల లోగిళ్లు

- పేద, మధ్యతరగతి నిరుద్యోగులకు వరం
- నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందజేత
- ఏడేండ్లలో 3వేల మందికిపైగా ఉద్యోగాలు
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువత ఆశయాలకు స్టడీ సర్కిళ్లు ఆయువు పోస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త రూపు సంతరించుకొన్న ఎస్సీ, బీసీ స్టడీసర్కిళ్లు ఉద్యోగార్థుల కలలను సాకారం చేస్తున్నాయి. నైపుణ్యాలను పెంపొందించుకొనే వేదికగా, ఉన్నత కొలువుల సాధనకు దిక్సూచిలా పనిచేస్తున్నాయి. స్టడీ సర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు విస్తరించ టం యువతకు కలిసివస్తున్నది. 11 బీసీ స్టడీ సర్కిళ్లు, 11 ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నా రు.
నిపుణులతో మెళకువలు, పోటీపరీక్షల సన్నద్ధానికి ప్రణాళికలు, వివిధ అంశాలపై ప్రత్యేక తరగతలు నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు, దినపత్రికలు, ఇతర మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. హాస్టల్ వసతి ఎంతోమంది పేద ఉద్యోగార్థుల కు ఉపయోగపడుతున్నది. ఫలితంగా ఎంతోమంది ఉ న్నత కొలువులు సాధిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలామంది ఇటీవల కానిస్టేబుళ్లు, బీట్ ఆఫీసర్లు, హాస్టల్ వెల్ఫేర్, సింగరేణి, గురుకుల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఫైర్ ఆఫీసర్లు, రైల్వే, ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందారు. గ్రూప్ 2, సివిల్స్‌లోనూ సత్తా చాటుతున్నారు.
బీసీ స్టడీ సర్కిళ్ళు..
- సివిల్స్‌తో కలుపుకొని శిక్షణ పొందినవారు 13,588
- ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు 1,988
ఎస్సీ స్టీడీ సర్కిళ్లు..
- సివిల్స్‌తో కలుపుకొని శిక్షణ పొందినవారు 8,331
- రాష్ట్ర సర్వీసును సాధించినవారు 1,184
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

