తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 15న ప్రారంభమైన సమావేశాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగాయి. 18న బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
15న ప్రారంభమైన అసెంబ్లీ 47 గంటల 44 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. పీఆర్సీపై ప్రకటన చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతపై ప్రకటన చేశారు. 75 మంది సభ్యులు ప్రసంగించారు. శాసనసభలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

