చాలెంజర్ ట్రోఫీ విజేత టీమ్ ‘ఏ’
బీసీసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆతిథ్యమిచ్చిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో టీమ్ ‘ఏ’ విజేతగా నిలిచింది. బుధవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమ్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో టీమ్ ‘డీ’పై విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : బీసీసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆతిథ్యమిచ్చిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో టీమ్ ‘ఏ’ విజేతగా నిలిచింది. బుధవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమ్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో టీమ్ ‘డీ’పై విజయం సాధించింది. తొలుత టీమ్ ‘డీ’ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మౌల్యరాజ్‌సింగ్ (56), అభినవ్ కన్నన్ (52) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఇషాన్సూద్ (2/59), హనీప్రతాప్ (2/51), అంబరీశ్ (2/28) రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ ‘ఏ’ 41.5 ఓవర్లలో 258/4 స్కోరు చేసింది. అభిజ్ఞాన్ కుందు (72 బంతుల్లో 105 నాటౌట్, 14ఫోర్లు, 2సిక్స్‌లు) సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యాడు. తోషిత్యాదవ్ (2/31), ఇనాన్ (2/50) రెండు వికెట్లు పడగొట్టారు. విజేతగా నిలిచిన టీమ్ ‘ఏ’కు హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్ నవీన్‌రావు ట్రోఫీతో పాటు పతకాలు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

