విద్యారుణంపై పన్ను రాయితీ!

ఉన్నత విద్య కోసం దేశీయంగా ఉన్న టాప్ విశ్వ విద్యాలయాలకు, విదేశీ యూనివర్సిటీలకు పిల్లలను పంపించడం ఈ రోజుల్లో చాలా కామన్. ఇందుకోసం తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ రుణాన్ని తీసుకోవడం కూడా సహజమే. అయితే ఎడ్యుకేషన్ రుణాలపై ఆదాయ పన్ను చట్టం 80ఈ కింద పన్ను మినహాయింపులను కూడా పొందవచ్చు. కానీ కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీర్ఘకాలానికి తీసుకునే ఈ విద్యా రుణం క్రమపద్ధతిలో తిరిగి చెల్లింపులో అనేక వెసులుబాట్లను కల్పిస్తుంది. టాక్స్ బ్రేక్స్‌తో రీపేమెంట్ చేయడం సులువు. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
ఎడ్యుకేషన్ లోన్ మీద అధికంగా ప్రయోజనాలను పొందాలంటే పన్ను మినహాయింపులను అర్థం చేసుకోవాలి. మీరు క్లెయిమ్ చేయాలనుకునే మొత్తంమీద ఎలాంటి పరిమితులు లేవు. చెల్లించే వడ్డీ మీద మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రిన్సిపల్ మీద లభించదు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వ్యక్తి డిడక్షన్స్ క్లెయిమ్ చేయవచ్చు. కేవలం విద్యార్థులే ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని లేదు. అమ్మాయిల కోసం మీరు రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లిస్తున్నట్టయితే టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. అమ్మాయి సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత తనే రుణాన్ని చెల్లిస్తున్నట్టయితే, ఆమె కాని, మీరు కాని పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయలేరు. ఎందుకంటే లోన్ మీ పేరు మీదే ఉంది కనుక. అలాగే ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం నుంచి రుణాన్ని చెల్లించడం లేదు. కనుక మీరు మినహాయింపులను కోరలేరు.
పన్ను మినహాయింపులు పొందాలంటే మీరే ఈఎంఐలు కూడా చెల్లించాలి. అలాగే మీ అన్నదమ్ముల పిల్లల కోసం మీరే రుణాన్ని తీసుకున్నట్టయితే, చట్టబద్దంగా వారికి సంరక్షకులు కానందు వల్ల పన్ను మినహాయింపు పొందలేరు. మరో ముఖ్య విషయం. అన్ని విద్యా రుణాలకు పన్ను మినహాయింపులు లభించవు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు మాత్రమే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీరు రుణం తీసుకోవాలనే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆ జాబితాలో ఉందేమో చూడండి. రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించిన తర్వాత వడ్డీ చెల్లింపులపై కేవలం ఎనిమిదేండ్లే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. అంతకు మించి రుణ కాలపరిమితి ఉంటే పన్ను మినహాయింపులు లభించవు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

