అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నా!
తెలుగు చిత్రసీమ 90వ దశకంలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపును సంపాదించుకుంది ఇంద్రజ. ఆ తర్వాత సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటూ సహాయ పాత్రల్లో రాణిస్తున్నది. రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘స్టాండప్ రాహుల్’ చిత్రంలో హీరో తల్లి పాత్రలో ఇంద్రజ నటించింది. శాంటో వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇంద్రజ పాత్రికేయులతో ముచ్చటించింది.
బాధ్యత నెరవేర్చే తల్లిగా..
ఈ కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. తల్లి పాత్రలోని భావోద్వేగాలు హృదయాన్ని హత్తుకున్నాయి. తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది. ఈ సినిమాలో ఇంటి బాధ్యత మొత్తం తీసుకునే అమ్మగా నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. భర్త దగ్గరలేని గుణాల్ని కొడుకులో చూడాలనునే తల్లి అందుకోసం ఏం చేసింది? కొడుకు జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దిందన్నది ఆకట్టుకుంటుంది. కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఏమిటో ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు.
యువతను మెప్పిస్తుంది..
ఇటీవలకాలంలో మేల్ ఆర్టిస్టులు చక్కటి సహాయ పాత్రల్ని సొంతం చేసుకుంటున్నారు. మహిళలకు ఆశించిన పాత్రలు రావడం లేదు. అందుకే తెలుగులో కాస్త గ్యాప్ వచ్చింది. రొటీన్ క్యారెక్టర్స్ వస్తుండటంతో కొన్ని సినిమాల్ని వదులుకున్నా. ‘స్టాండప్ రాహుల్’ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌కు కూడా బాగా నచ్చుతుంది. తమకు ఇష్టమైన పని చేసుకుంటూ యువత జీవిత లక్ష్యాల్ని సాధించుకోవచ్చనే అంశాన్ని బాగా చూపించారు. భార్య భర్తల అనుబంధం, పిల్లలతో సత్సంబంధాలు ఎలా నిలుపుకోవాలి అనే సున్నితమైన విషయాలు ఈ సినిమాలో బాగా డీల్ చేశారు.
పోటీ ఎక్కువైంది..
నేటితరం నాయకానాయికలకు అన్ని విషయాలు అవగతమవుతున్నాయి. సీనియర్ నటిగా వారికి నా సలహాలు అవసరం లేదనుకుంటున్నా. ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన పాత్రలు చేసేవారు చాలా మంది ఉన్నారు. దాంతో పోటీ కూడా ఎక్కువైంది. నా మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకుంటున్నా. నటీనటులకు ఎప్పటికీ సంతృప్తి దొరకదు. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉందనుకుంటున్నా. మంచి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే నా ముందున్న కర్తవ్యంగా భావిస్తున్నా. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

