అగ్ర హీరో ప్రభాస్ చిన్న సర్జరీ చేయించుకున్నారు. గతంలో ‘సలార్’ సినిమా షూటింగ్లో ఆయన గాయపడ్డారు. ఆ గాయానికి చికిత్సలో భాగంగా ప్రభాస్ స్పెయిన్ వెళ్లినట్లు సమాచారం. అక్కడ బార్సిలోనాలో ప్రభాస్‌కు శస్త్ర చికిత్స జరిగింది. వైద్యులు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో అక్కడే గడిపేందుకు నిర్ణయించుకున్నారీ స్టార్ హీరో. తాజాగా ‘రాధే శ్యామ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్..నాలుగేళ్లు ఈ సినిమా కోసం శ్రమించారు. సినిమా విడుదల తర్వాత కొంత విరామం తీసుకోవడం స్టార్లకు అలవాటు. చికిత్సతో పాటు ఆ సమయం కూడా ప్రభాస్‌కు కలిసివచ్చినట్లే. ఇక ఆయన ఖాతాలో ఐదు భారీ చిత్రాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ఓం రావత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’, సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉన్నాయి.