నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం అస్వస్థతకుగురై చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సాధారణ హెల్త్ చెకప్ కోసమే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి కావేరి ఆసుపత్రి వర్గాలు శుక్రవారం హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశాయి. ‘ఒంట్లో నలతగా అనిపించడంతో రజనీకాంత్‌గారు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రతి ఏడాది సాధారణంగా జరిగే చెకప్‌లో భాగంగా ఆయనకు కొన్ని పరీక్షలు చేశాం. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో కొన్ని బ్లాక్స్‌ను గుర్తించాం. నిపుణులైన వైద్యబృందం ఆధ్వర్యంలో వాటిని తొలగించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

