ముంబై: ఫిల్మ్ స్టార్ సన్నీ లియోన్.. బాస్కెట్‌బాల్ స్కిల్స్ ప్రదర్శించింది. ఎరుపు రంగు చీర కట్టిన ఆ అందాల భామ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సరదాగా బాస్కెట్‌బాల్ ఆడింది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేసింది. చీర కట్టులో బాస్కెట్‌బాల్ ఆడుతున్న సన్నీ వీడియో ఆమె అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని యే లడ్కీ హై దివానా సాంగ్‌ను ఆ వీడియోకు ట్రాక్‌గా వాడిందామె. ఇటీవల సన్నీ తన భర్తతో కలిసి మాల్దీవులకూ వెళ్లింది. అక్కడ బీచ్‌లో దిగిన బోలడన్నీ ఫోటోలను ఆమె పోస్టు చేసింది.