సీనియర్ల స్టార్టప్‌లకూ ఊతం

- వయసుకు కాదు ఆవిష్కరణకే ప్రాధాన్యం
- తొలిసారిగా గెట్సెట్అప్ రూపంలో నైపుణ్యానికి చక్కని వేదిక
- 55 ఏండ్లు పైబడిన వారి వినూత్న ఆలోచనలకు వర్చువల్ కమ్యూనిటీ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 27 : స్టార్టప్… ఈ పదం వినిపించగానే ఉరకలెత్తే యువతరం! అబ్బురపరిచే వినూత్న ఆవిష్కరణలు!! ఇవే గుర్తొస్తాయి. కానీ ఇకనుంచి ఈ పదం యువతకే కాదు… వయసు పైబడిన వారి వినూత్న ఆలోచనలకూ చక్కని వేదికగా మారనున్నది. గెట్సెట్అప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రాం ద్వారా సీనియర్ల వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో స్టార్టప్‌ల ఏర్పాటుకు తొలిసారిగా అవకాశం లభించింది. ఆహారం, ఆహార సంబంధిత రంగాలు, శిక్షణ, దుస్తులు, ఉపకరణాలు, కళలు, చేతివృత్తులు… ఏ రంగంలోనైనా వ్యాపార వినూత్న ఆలోచనలు ఉన్నవారు ఇందులో భాగస్వాములు అయ్యేందుకు వీలుంటుంది. ముఖ్యంగా 55 సంవత్సరాల వయసు పైబడినవారు ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు గెట్సెట్అప్ అవకాశం కల్పించనుంది. గెట్సెట్అప్ కమ్యూనిటీ 160 దేశాల్లో విస్తరించి ఉండగా… దాదాపు 40 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. మార్కెటింగ్, సోషల్ మీడియా, టెక్నాలజీ తరగతులు, ఆర్థిక ప్రణాళిక వంటి విషయాల్లో సభ్యులకు సహాయపడేందుకు ఇందులో ఉచితంగా తరగతులు నిర్వహిస్తామని వ్యవస్థాపకుడు దేవల్ డెలివాటా చెప్పారు. అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసి.. వీడియోకాల్ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు తమ ఆలోచనలను, ఆవిష్కరణలను ముగ్గురు నిపుణుల బృందానికి అందించేందుకుగాను డెమో డేలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రోగామ్స్ ముగింపులో ఆర్థిక మద్దతు కోసం రెండు ఆవిష్కరణలను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్నవారు వచ్చేనెల నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Discovery
- inventions
- Start up
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

