శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకుడు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 30న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. రాజకీయ, సమకాలీన అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. వ్యవస్థలోని అవినీతిపై, దుష్టశక్తులపై ఓ సామాన్య యువకుడు చేసే తిరుగుబాటు ఏమిటన్నదే చిత్ర కథ. శ్రీవిష్ణు మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు’ అని చెప్పారు. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: మణిశర్మ, రచన: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: సాయి కొర్రపాటి, దర్శకత్వం: చైతన్య దంతులూరి.