Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Srisailam Dam | శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ గుర్తింపు పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యేకు ప్రతినిధులు అందజేశారు.
Srisailam Dam | శ్రీశైలం: కృష్ణానది (Krishna River)పై ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ డ్యామ్ విశిష్టతకు లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(World Book of Records)’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్ శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి జలవనరుల శాఖ, ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో అధికారుల సమక్షంలో అందజేశారు. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం డ్యామ్ నిలిచింది.
శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) 2009 వరదల్లో 25.4 లక్షల క్యూసెక్కుల వరదను డ్యామ్ తట్టుకోవడంతో పాటు డ్యామ్ నిర్మాణం, నిర్మాణ శైలి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ విధానం వంటి విశిష్టతలను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిగణించింది. అదేవిధంగా దక్షిణాసియాలో ఏ ప్రాజెక్టులోనూ లేనివిధంగా ఈ డ్యామ్‌లో 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన గేట్లు ఉండటం కూడా ఈ గుర్తింపునకు కారణం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

