శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మే 6న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ…వైజాగ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మొదటి సినిమా ఇక్కడే చిత్రీకరించాను. సెలవుల్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఈ సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి. మీకు మంచి జ్ఞాపకంగా మిగిలే చిత్రమవుతుంది. జర్నలిస్ట్ పాత్రలో క్యాథరీన్ ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు ఇప్పటిదాకా చేయని కొత్త క్యారెక్టర్లో మెప్పిస్తారు. మణిశర్మ సంగీతం అలరిస్తుంది. అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..వారాహి సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. చైతన్య నాకు 14 ఏళ్లుగా స్నేహితుడు. నా కెరీర్లో ఇదొక భిన్నమైన చిత్రంగా నిలుస్తుంది. 2 వేల కోట్ల రూపాయల హవాలా స్కామ్‌ను ఎలా ఛేదించాం అనేది ఆసక్తిరేపుతుంది. క్యాథరీన్‌కు మంచి పేరొచ్చే చిత్రమిది. గరుడ రామ్ విలనీ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’ అన్నారు. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు, రచన: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: సాయి కొర్రపాటి, దర్శకత్వం: చైతన్య దంతులూరి.