శర్వానంద్‌కు షాకిచ్చిన శ్రీకారం మూవీ..!

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. ఎలాంటి పక్కదారి పట్టకుండా తాను అనుకున్న కథను అనుకున్నట్లు చాలా బాగా తీసాడు అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిసింది. అయితే వసూళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం శ్రీకారం దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు శర్వానంద్. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు కూడా కలెక్షన్స్ రాకపోవడంతో శర్వానంద్ నిరాశలో ఉన్నాడు. శివరాత్రికి వచ్చిన జాతి రత్నాలు దెబ్బకు శ్రీకారం వెనక్కి తగ్గింది. ఈ సినిమా ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు వచ్చేసింది..
నైజాం- 2.86 కోట్లు
సీడెడ్- 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.21 కోట్లు
ఈస్ట్- 0.74 కోట్లు
వెస్ట్- 0.50 కోట్లు
గుంటూరు- 0.99 కోట్లు
కృష్ణా- 0.53 కోట్లు
నెల్లూరు- 0.32 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 8.82 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.30 కోట్లు
ఓవర్సీస్- 0.52 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 9.64 కోట్లు
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలిరోజు వచ్చిన టాక్ తో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందనే అనుకున్నారు. కానీ 17. 5 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కేవలం 9.64 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 7.86 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో శర్వానంద్‌కు ఇది వరుసగా 4వ డిజాస్టర్ కావడం గమనార్హం. ఈయన గత సినిమాలు జాను, రణరంగం, పడిపడి లేచే మనసు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు శ్రీకారం జాబితాలో చేరిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

