శ్రీవిష్ణు పెద్దస్టార్ కావాలి!
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదల కానుంది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదల కానుంది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా శ్రీవిష్ణు పాత్రను పరిచయం చేశారు. కేసులను డీల్ చేయడంలో అతనిది రాజీలేని మార్గం. నక్సలైట్లు, నేరస్థులతో చర్చలు జరిపి వారిలో మార్పును తీసుకొస్తాడు.
అయితే వృత్తినిర్వహణలో అతనికి అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ట్రైలర్లో ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. నాని మాట్లాడుతూ ‘శ్రీవిష్ణు యాక్షన్ సినిమా చేయడం ఇదే మొదటిసారని అనుకుంటున్నా. ఆయన కథల ఎంపిక బాగుంటుంది. శ్రీవిష్ణుకి ఇప్పటికే మంచి నటుడని పేరొచ్చింది. ఆయన పెద్ద స్టార్ అయిపోవాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అన్నారు. అందరి టీమ్ వర్క్‌తో సినిమా అద్భుతంగా వచ్చిందని శ్రీవిష్ణు పేర్కొన్నారు. శ్రీవిష్ణు నట విశ్వరూపాన్ని ఆవిష్కరించిన చిత్రమిదని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

