ముంబై: దక్షిణాఫ్రికాకు చెందిన యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న అతను.. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ కేవలం 25 బంతుల్లో 49 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. 18 ఏళ్ల బ్రెవిస్ .. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో దుమ్మురేపాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఒక ఫోర్‌తో పాటు వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. బ్రెవిస్‌ను బేబీ డివిలీర్స్ అంటూ పొగుడుతున్నారు. డెవాల్డ్ కొట్టిన చివరి సిక్సర్ ఏకంగా 112 మీటర్ల దూరంలో పడింది. ఈ యేటి ఐపీఎల్ టోర్నీలో ఇదే లాంగెస్ట్ సిక్సర్ కావడం విశేషం. ఆ ఓవర్లో చాహర్ 29 రన్స్ ఇచ్చాడు. బ్రెవిస్, సూర్యకుమార్ రాణించినా.. ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు.
Baby AB has arrived.#babyAB #MIvsPBKS#dewaldbrevispic.twitter.com/LnVG4rH51U
— Sonuu Yaduvanshi (@yaadavsonuu) April 13, 2022