చార్లెస్ శోభరాజ్ గర్ల్ఫ్రెండ్కుసోనియా ఇంటి నుంచి భోజనం
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్‌లో సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తావన కూడా తెచ్చారు.
- ఆత్మకథలో ప్రస్తావించిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ, నవంబర్ 12: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్‌లో సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తావన కూడా తెచ్చారు. ఎమర్జెన్సీ అనంతరం మాజీ ప్రధాని, తన అత్త ఇందిరా గాంధీని తీహార్ జైలులో ఉంచారు. ఈ క్రమంలో 1978 క్రిస్మస్ రోజున జైలులో ఉన్న అత్తకు సోనియా గాంధీ భోజనం తీసుకువెళ్లారు. తనతో పాటు మరో ముగ్గురికి కూడా భోజనం తెమ్మని ఇందిర చెప్పడంతో ఆమె అందరికీ భోజనం తీసుకుని జైలుకు వెళ్లారు.
‘ముగ్గురు మహిళా గార్డులు, జైలులో ఖైదీగా ఉన్న ఒక విదేశీ మహిళకు నేను మధ్యాహ్న భోజనం తీసుకుని వెళ్లా. ఆమె ఎవరో కాదు భారత్‌తో పాటు థాయ్‌లాండ్, నేపాల్‌లలో పలువురు యువ పర్యాటకులను హత్యచేసిన కేసుల్లో దోషిగా ఉన్న సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజు గర్ల్‌ఫ్రెండ్’ అని సోనియా తన ఆత్మకథలో పేర్కొన్నారు.
‘నా అత్తగారికి ఆమె పట్ల జాలి కలిగింది, ఆమె పంది మాంసం తినదని తెలిసినప్పుడు, మేము వెంటనే మెనూ మార్చి దానికి బదులుగా చికెన్ రోస్ట్‌ను సిద్ధం చేయాల్సి వచ్చింది’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే తన అత్తగారు భోజనం తెమ్మని చెప్పిన విదేశీ మహిళ పేరును సోనియా ప్రస్తావించ లేదు. ఆమెను ఆస్ట్రేలియా యువతిగానే ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

