Solar power | సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి
తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ విషయమై రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్‌ను కలిశామని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు.
Solar power | సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ విషయమై రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్‌ను కలిశామని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు. శనివారం ఖైరతాబాద్‌లోని టీజీ ట్రాన్స్‌కో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యుత్ వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన సోలార్ యూనిట్ల ఏర్పాటు కాంట్రాక్టర్లు వీటిని ఏర్పాటుకు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం సైతం ఈ పథకానికి మద్దతుగా నిలిస్తే తెలంగాణలో లక్షలాది మంది తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ పెట్టుబడితోనే విద్యుత్ సౌకర్యాన్ని పొందడంతో పాటు తిరిగి సోలార్ విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించే స్థాయికి వస్తాయని అశోక్‌కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన వారిలో సోలార్ ఎనర్జీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీహరి బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజేశ్ పరకాల తదితరులు ఉన్నారు.
రేపు జాబ్‌మేళా
సిటీబ్యూరో, జులై 22 ( నమస్తే తెలంగాణ ) : మల్లెపల్లిలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రీప్రియా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాచారం కోసం 8328428933 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
మేడ్చల్ కలెక్టరేట్: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పన అధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువత www. nic.gov.in పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9866465024 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

