Helicopter Crash | ఖతార్‌లో కూలిన సైనిక హెలికాప్టుర్.. ఆరుగురు సిబ్బంది దుర్మరణం
Helicopter Crash | ఖతార్ (Qatar) లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ (Military Helicopter) సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Helicopter Crash : ఖతార్ (Qatar) లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ (Military Helicopter) సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం (Technical Issue) తలెత్తడమే ప్రమాదానికి కారణమని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ (Qatar deffence Ministry) ప్రకటించింది.
ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘ఖతార్‌కు చెందిన హెలికాప్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగా సాంకేతిక సమస్య కారణంగా దేశ జలాల్లో కూలిపోయింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఏడో వ్యక్తి కోసం కోస్ట్‌గార్డ్, బార్డర్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతా దళాలకు చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమేనని, దీని వెనుక ఎలాంటి శత్రుచర్య లేదని అధికారులు స్పష్టంచేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రకం, అది కూలిపోయిన కచ్చితమైన ప్రదేశం లాంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

