సండే ఎపిసోడ్లో నాగార్జున హౌజ్‌మేట్స్‌తో ఇంట్లో ఉన్న దెయ్యం ఆట ఆడించాడు. ఎవరినైైతే దెయ్యం అని ఫీల్ అవుతురో వారికి ఆ స్టిక్కర్ పెట్టి సరైన కారణాలు చెప్పాలని నాగ్ అన్నాడు. సిరిని దెయ్యంగా పేర్కొంది ప్రియ. పడుకోవడానికి రమ్మంటే రాదని చెప్పుకొచ్చాడు. శ్రీరామ్ చంద్ర..మానస్ పేరు చెప్పాడు. ఆయన విధానం నచ్చని కారణంగా స్టిక్కర్ అంటించినట్టు తెలిపాడు.
ట్టిగా చెబుతుందని ఉమకు లహరి దెయ్యం స్టిక్కర్ పెట్టేసింది. స్వీట్ రాక్షసి అనే పేరు కూడా పెట్టింది. ఆనీ మాస్టర్‌కు హమీద స్టిక్కర్ పెట్టేసింది. ఇక శ్రీరామచంద్ర వచ్చి మానస్‌కు దెయ్యం స్టిక్కర్ అతికించాడు. ఓటిమిని మానస్ అంగీకరించలేకపోతున్నాడు అని పేర్కొన్నాడు.
ఇక బర్త్ డే బాయ్ రవి.. శ్రీరామ్ చంద్రకు అంటించాడు. చెల్లి అంటూ ప్రియాంకకు దెయ్యం స్టిక్కర్‌ను పెట్టేశాడు సన్నీ. కాజల్‌కు దెయ్యం స్టిక్కర్‌ను విశ్వ పెట్టగా, రాత్రంతా పడుకోడు అంటూ లోబోను దెయ్యంగా ప్రియాంక పేర్కొంది. ఇక సిరిని దెయ్యంగా జెస్సీ పేర్కొన్నాడు. శ్వేత కూడా.. సిరిని దెయ్యంగా పేర్కొంది. ఆనీ మాస్టర్ మాత్రం మదిలో ఇద్దరున్నారని చివరకు హమీదను దెయ్యంగా పేర్కొంది.
కాజల్.. విశ్వను టార్గెట్ చేస్తూ అతనికి దెయ్యం స్టిక్కర్ అంటించింది. ఉమను దెయ్యంగా సిరి పేర్కొంది. నటరాజ్ మాస్టర్ వచ్చి.. విశ్వకు దెయ్యం స్టిక్కర్‌ను పెట్టేశాడు. ఇక షన్ను మాత్రం తనకు తాను దెయ్యంగా పేర్కొన్నాడు. అలా కుదరదు అని నాగ్ చెప్పడంతో.. సిరికి దెయ్యం స్టిక్కర్‌ను షన్ను పెట్టేశాడు. ఉమా కూడా సిరికి స్టిక్టర్ అంటించింది. లోబో సైతం సిరికే స్టిక్కర్ పెట్టేశాడు. మొత్తానికి ఈ గేమ్‌లో సిరి ఎక్కువ మందికి దెయ్యంగా మారింది.