మంత్రి హరీశ్‌రావుతో సింగపూర్ హై కమిషనర్ బృందం భేటీ
మంత్రి హరీశ్‌రావుతో సింగపూర్ హైకమిషనర్ బృందం భేటీ | రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో సింగపూర్ హై కమిషనర్ హెచ్ఈ సైమన్వాంగ్ బృందం భేటీ అయ్యింది. సోమవారం అరణ్య భవన్లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో సింగపూర్ హై కమిషనర్ హెచ్ఈ సైమన్వాంగ్ బృందం భేటీ అయ్యింది. సోమవారం అరణ్య భవన్లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని మంత్రి హరీశ్‌రావు సైమన్వాంగ్ బృందానికి వివరించారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సైమన్ వాంగ్ చెప్పారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాయని మంత్రి వారికి వివరించారు. భౌగోళికంగా హైదరాబాద్ సురక్షితమైన నగరమని, ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్‌గాను మారిందని, సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైందని చెప్పారు. ఏడాది పొడవునా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్నారు. మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, ఎయిర్ పోర్టు, శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతినిధి బృందం ఆరా
భేటీ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టని మంత్రి హరీశ్‌రావు వివరించారు. వంద మీటర్ల నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం రంగం పరిశీలిస్తే ఏడున్నరేళ్ల కాలంలో సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు జరిగేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల పాటు సరఫరా సరఫరా చేస్తున్నామన్నారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, ఎకరానికి 5వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.పది వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. రైతుల పంటను మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఈ కారణంగా రైతుల ఆత్మహత్యలను పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. ఈ ఫలితంగా తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేసిందన్నారు. పంజాబ్ రాష్ట్రం దేశంలో ఇప్పటి వరకు నంబర్ వన్‌గా ఉండేదని, కానీ ఆ రాష్ట్రం గత ఏడాది 2 కోట్ల 2లక్షల మెట్రిక్ టన్నులు పండించి రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. విద్యుత్ రంగంలోను స్వావలంబన సాధించామన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని చెప్పారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా పల్లెలలోను సమూలంగా మార్పులు తెచ్చామన్నారు. మంచి రోడ్లు, చెత్త సేకరణ, డంప్ యార్టులు వంటి వసతులు అన్ని గ్రామాల్లో కల్పించామన్నారు. హరితహారం పథకం కింద మొక్కలు పెంచడం ద్వారా ఈ ఏడేళ్లలో రెండు శాతం పచ్చదనం పెంచినట్లు తెలిపారు.
ఈ దఫా పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలోని పల్లెలను సందర్శించి అక్కడ నెలకొన్న మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీలో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ తో పాటు హైకమిషన్ సెక్రెటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ ( చైన్నై ) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహం పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్ రావు వారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

