3 నెలలు పరిశోధించాం!

“శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో రెండు కథలుంటాయి. ఒకటి వర్తమానంలో జరుగుతుంది. మరొకటి 70దశకంలో జరుగుతుంది. నాటి పరిస్థితుల్ని చూపించడానికి చాలా కష్టపడ్డాం’ అన్నారు కళా దర్శకుడు అవినాష్ కొల్ల. నాని కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మూడేళ్లపాటు పరిశోధన చేశా. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బెంగాల్లోనే ఉన్నా. కథానుగుణంగా బెంగాల్ వాతావరణాన్ని సృష్టించడం సవాలుగా అనిపించింది. అక్కడి ఆర్కిటెక్చర్, దేవాలయాలపై పూర్తిస్థాయిలో పరిశోధన చేశా. సెట్స్ మొత్తం హైదరాబాద్‌లోనే వేశాం. దేవాలయం నేపథ్యంలో వేసిన భారీ సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కించాం.
సినిమాకు అదే హైలైట్ అవుతుంది. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడునెలల పాటు శ్రమించాం. దేవదాసిలకు సంబంధించిన గుడి సెట్ కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నా. సినిమా విజువల్స్ బాగా రావాలంటే కళా దర్శకత్వంతో పాటు కెమెరా పనితనం కూడా చాలా ముఖ్యం. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ద్వారా ఆర్ట్‌డైరెక్టర్‌గా అరంగేట్రం చేశాను. ‘జెర్సీ’ సినిమాకు కూడా పనిచేశా. ప్రస్తుతం నాని ‘దసరా’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు కళాదర్శకత్వం వహిస్తున్నా’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- avinash kolla
- Nani
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

