Uttarakhand Polls | రాహుల్, కేజ్రీవాల్ రాహు, కేతువుల వంటి వారు : శివరాజ్ సింగ్ చౌహాన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డెహ్రాడూన్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్, కేజ్రీవాల్‌ను రాహు, కేతువులుగా శివరాజ్ చౌహాన్ అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లో వీరిద్దరిలో ఏ ఒక్కరు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. వీరు అభివృద్ధి నిరోధకులుగా మారతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శివరాజ్ చౌహాన్ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు విసురుతున్నారు. రాష్ట్రంలో భారీ మార్పు రానుందని, ఉత్తరాఖండ్‌లో నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాము ఉత్తరాఖండ్‌ను అంతర్జాతీయ హిందువుల రాజధానిగా మలుస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగానికి ఉత్తేజం తీసుకువస్తామని, ఇక్కడి యువతకు వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. హరిద్వార్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లో సత్తా చాటేందుకు ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఉద్ధంసింగ్ నగర్ జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు
. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మాటలను పెడచెవినపెడుతూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, పేదల కష్టాలను మోదీ సర్కార్ ఆలకించడంలేదని దుయ్యబట్టారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిన్నర పాటు రైతులు ఆందోళన చేపట్టినా మోదీ ప్రభుత్వం మౌనం దాల్చిందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేదల సమస్యలను సావధానంగా విని పరిష్కరించేందుకు ప్రయత్నించిందని వివరించారు. మోదీ హయాంలో అలాంటి పరిస్ధితి లేదని ఆరోపించారు. ఇక ఉత్తరాఖండ్‌లో మరోసారి అధికారంలోకి రావాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, కాషాయ పార్టీకి దీటైన పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ తనదైన వ్యూహాలకు పదునుపెడుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

