కృష్ణ, జూన్ 24: రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఈనెల 25 నుంచి 27వరకు నెవ్స్కీ అంతర్జాతీయ పర్యావరణ కాంగ్రెస్ -2026 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఇందులో భారత్ తరఫున పాల్గొనేందుకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుర్జాలకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు శివరాజ్ పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని రాయిచూర్లోని ఉంటూ విద్యారంగంలో రాణిస్తున్నారు.
ఆతిథ్య (హాస్పిటల్స్), విద్యారంగంలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న తనకు ‘పాత్నే గ్లోబల్ అలయన్స్ ప్రతినిధి బృందం తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉన్నదని బుధవారం ఒక ప్రకటనలో శివరాజ్ పేర్కొన్నారు.